తానే నా కూతురు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ అల్లుడు..!!

మెగాస్టార్ కుటుంబానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది. కళ్యాణ్ దేవ్ దంపతులకు నవ్విష్క జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా సాగుతున్న సమయంలో వీరిద్దరు విడిపోతున్నారంటు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు మెగా కుటుంబం సపోర్టు కూడా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనని మెగా అభిమానులు భావిస్తున్నారు.

Another witness to the news of Chiranjeevi's daughter Divorce; Sreeja |  Chiranjeevi daughter Sreeja unfollows husband Kalyaan Dhev on Instagram |  PiPa News

ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నప్పటికీ విడాకుల గురించి మాత్రం ఇంకా అధికారికంగా ఏ విషయం బయటికి రాలేదు. ఇక నవిస్క సైతం ప్రస్తుతం శ్రీజ వద్దే ఉన్నది..కానీ తన కుమార్తె విషయంలో వీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యారని తన కుమార్తె శ్రీజ వద్ద మాత్రమే కాకుండా కళ్యాణ్ దేవ్ వద్ద కూడా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ తన కుమార్తెతో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఇప్పుడు మళ్లీ తాజాగా తన కుమార్తె గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.. ఇలా రాసుకోస్తూ” నా గుండె నా ఆత్మ నా జీవితంలో నాకు దొరికిన ఏదైనా గొప్ప విషయం ఉందా అంటే అది తన కూతురు నవ్విస్క మాత్రమేనని తెలిపారు..నా నవ్వుకు కారణం తానే..నవిష్క నా కూతురు..తానే నా ప్రపంచం నేడు పాప పుట్టినరోజు హ్యాపీ బర్తడే అంటూ తెలియజేశారు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు కళ్యాణ్ దేవ్”. దీంతో ప్రస్తుతం శ్రీజ ,కళ్యాణ్ విడిపోయారని స్పష్టత వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. మరి అసలు విషయం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.<

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

/p>