వార్నీ.. ఇలియానా ఇంత ప‌ద్ధ‌తిగా మారిపోయిందేంటి.. షాకైపోతున్న నెటిజ‌న్లు!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్ కు మాకాం మార్చింది. అక్కడ సత్తా చాటాలని ప్రయత్నించింది.

వరుస సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో పాగా వేయలేకపోయింది. ఇక అదే సమయంలో ప్రియుడుతో బ్రేకప్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన‌ ఇలియానా.. కెరీర ను ఫిట్ నెస్ ను గాలికి వదిలేసింది. మ‌ళ్లీ ఈ మధ్యే కెరియర్ పై ఫోకస్ పెట్టి ఫిట్ గా మారింది.

అయితే ఈమెకు ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా అవకాశాలు మాత్రమే వ‌స్తున్నాయి. ఈ సంగతి పక్కన పెట్టే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఇలియానా తరచూ చిట్టి పొట్టి బట్టలతో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటుంది.

ముఖ్యంగా బికినీలో ఈ అమ్మడు చేసే ఫోటోషూట్లు నెట్టింట ఎంత‌టి దూమారం రేపుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఏద‌మైందో ఏమో కానీ తాజాగా ఇలియానా ఎవరు ఊహించని విధంగా చీరలో దర్శనమిచ్చింది.

ట్రెడిషనల్ లుక్ లో అందంగా ముస్తాబై ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇలియానా తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి వార్నీ.. ఇలియానా ఇంత ప‌ద్ధ‌తిగా మారిపోయిందేంటి అంటూ నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు.