అడివిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అడవి శేష్‌కి మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇక ఈ సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో నాని హిట్ సినిమాను తెరకెక్కించి దానికి సిక్వల్ గా ఇప్పుడు హిట్ 2 తీసుకొచ్చాడు. ఈ హిట్ సినిమాలను సూపర్ హీరోస్ ఫ్రాంచైజీ ల లాగా ఏడు భాగాలుగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.
ఇప్పటికే హిట్ 3ని కూడా అనౌన్స్ చేయగా. అందులో హీరోగా మాస్ మహారాజా రవితేజ నటిస్తారని తెలుస్తుంది. హిట్2 సినిమాలో అడివి శేష్ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.. ఇక ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టీమ్ బాలకృష్ణను కలిసి ఆయనకు హిట్2 సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూపించారు. అప్పుడు మరో విశేషం కూడా జరిగింది.
అక్కడ బాలకృష్ణ తో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాను చూశాడు. ఈ విషయాన్ని ఆ సినిమా హీరో అడివి శేష్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టులో బాలయ్య, మోక్షజ్ఞతో కలిసి ఉన్నన ఫొటోస్ ని ఆడి విశేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో నాని కూడా ఉన్నాడు. ‘బాలయ్య సార్ కి ఈ సినిమా బాగా నచ్చింది నా పెర్ఫార్మెన్స్ గురించి దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఎంతగానో ప్రశంసించాడు’.
‘ఇక వచ్చే హిట్ సిరీస్‌లో మీరు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ చేయాలని నేను బాలయ్య ని రిక్వెస్ట్ చేయగా.. ఆయన అందుకు ఒక చిరునవ్వు నవ్వి.. ఏమో ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు’. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా చాలా స్వీట్ కిడ్ మోక్షజ్ఞ కి కూడా ఈ సినిమా బాగా నచ్చింది అంటూ ఫోటోలు కింద తన కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి. ఇక అందరూ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.