బాలయ్య 108 నుంచి అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుస సినిమాల ప్రకటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలే కాదు ఇంకొకవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఐదవ ఎపిసోడ్ కి ఎవరు గెస్ట్ గా రాబోతున్నారు అనే ఆసక్తి కూడా నెలకొంది.

What happened to NBK-Anil Ravipudi project announcement?

ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్న బాలయ్య.. జనవరి 12వ తేదీన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన తదుపరిచిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాతో సందడి చేసిన ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు ఈ సినిమాలో అవకాశాన్ని తగ్గించుకుంది.

Priyanka Jawalkar Wiki, Age, Boyfriend, Husband, Family, bio & More –  Wiki24x7డిసెంబర్ 8 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ మరొక హీరోయిన్గా ఎంపికైంది అని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ తెలుగు అమ్మాయికి కచ్చితంగా ఆఫర్లు క్యూ కడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇందులో బాలకృష్ణ కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే.

Share post:

Latest