ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైన రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె పుష్ప2 తో పాటు పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ముందుగా కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమా ద్వారా ప్రారంభించింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కాంతారా హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇద్దరి జోడి కి మంచి పేరు కూడా వచ్చింది. రష్మిక కూడా రక్షిత్‌తో లవ్‌లో పడిందని టాక్ కూడా నడిచింది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగి పెళ్లి మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతుంది. రీసెంట్గా కన్నడ నుంచి వచ్చిన కాంతారా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు ఎంతో గొప్ప పేరు కూడా వచ్చింది.
అయితే రష్మిక ఈ సినిమాపై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేయడంతో. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రష్మికను బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా వస్తుంది. దీంతో ఎప్పుడు రష్మికను ప్రముఖ జ్యువలరీ సంస్థ ఖజానా బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల రష్మికను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్టు, అలాగే ఆమె స్థానంలో త్రిషను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది. రష్మిక, కన్నడ చిత్ర వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.