కృతి శెట్టికి ఊహించ‌ని షాకిచ్చిన సూర్య‌.. అర‌రే ఎంత ప‌నైంది?

యంగ్ సెన్సేషన్ కృతి శెట్టికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించని షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలకు వెళ్తే.. ప్రముఖ దర్శకుడు బాలతో సూర్య ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్య కెరీర్ లో 41వ ప్రాజెక్ట్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

 

తమిళంలో ఈ చిత్రానికి `వనన్‌గాన్`, తెలుగులో `అచలుడు` అనే టైటిల్స్‌ను కన్ఫామ్ చేశారు. ఇటీవల కన్యాకుమారిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సైతం కంప్లీట్ అయింది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాల స్వయంగా వెల్లడించారు. అచలుడు కథలు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని.. దాంతో ఈ సినిమా కథ సూర్యకు సరిపోద‌ని భావించి ఆయ‌న త‌ప్పుకున్నార‌ని బాల తెలిపాడు. పరస్పర అంగీకారంతోనే ఇది జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశాడు.

అయితే సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుందని బాల తెలిపారు. ఇక ఈ విషయం తెలియ‌గానే నెటిజ‌న్లు పాపం కృతి శెట్టి అంటూ జాలి ప‌డుతున్నారు. కోలీవుడ్ లో కృతి శెట్టి డ‌బ్యూ మూవీ ఇది. పైగా సూర్య వంటి స్టార్ హీరో సినిమాతో తమిళంలోకి అడుగుపెడుతున్నానని కృతి శెట్టి ఎంతగానో సంబరపడింది. కానీ ఇప్పుడు ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో కృతి శెట్టిని ఊహించని షాక్ తగిలింది.

https://twitter.com/DoneChannel1/status/1599418334617153536?s=20&t=2DczDC3uLm3JwwsKNi_AVw