పెళ్లి లేదు గిల్లీ లేదు.. కీర్తి సురేష్ భ‌లే అన్సార్ ఇచ్చిందిగా!

`మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అందాల భామ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట‌ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పబోతోందని, అందుకే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోవడం లేదంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు కీర్తి పరోక్షంగా అన్సార్ ఇచ్చేసింది. తాజాగా త‌న కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి పెళ్లి లేదు గిల్లీ లేదు అని చెప్పకనే చెప్పేసింది. కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ లో కీర్తి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతోంది.

`రగ్ తాథా` టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో క‌నిపించ‌బోతోంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. మ‌రికొద్ది రోజుల్లో ఈ మూవీ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.