టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్లలో టబు నటన, అందం గురించి, గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ హీరోలతో జత కట్టి నటించిన టబు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించింది. అయితే కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టబు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.
టబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ గా ఉన్న సమయంలో ఎంతో కష్టపడి పని చేశాను. కాబట్టి ఇప్పుడు ఇంత సుఖంగా ఉన్నాను అని తెలియజేస్తుంది. ప్రస్తుతం టబు తెలుగు , హిందీ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. టబు వయసు మీద పడుతున్నా కూడా సినిమాలలో ఇంకా అంతే అందంతో ఘాటైన రొమాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టబు ఈ వయసులో కూడా యువ హీరోయిన్లకు దీటుగా రొమాన్స్ చేస్తూ ఉంటోంది. బాలీవుడ్ లో వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టబు నటించిన భూల్ భులయ్య-2, దృశ్యం-2 వంటి చిత్రాలతో సక్సెస్ అందుకొని బాలీవుడ్ కి ఊపిరి పోసింది.
ఈ సినిమాలో సక్సెస్ వెనుక చాలా కష్టం ఉందని గుర్తు చేస్తోంది. గత ఏడాదికాలంలో నాలుగైదు సినిమాలలో విశ్రాంతి లేకుండా నటించానని , అలా పని చేయడం చాలా కష్టంగా కూడా ఉండడంతో ఛాలెంజ్ గా తీసుకొని చేశానని తెలియజేస్తోంది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడి.. వాటిని సవాలుగా తీసుకొని చేశానని తెలియజేస్తుంది టబు. హీరోయిన్గా ఉన్నంతకాలం ఇలాగే కష్టపడ్డాను అందుచేతను ఇప్పుడు సుఖపడుతున్నానని తెలియజేసింది. ప్రస్తుతం టబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.