మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమట. తమ సినిమాలకు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆ సీనియర్ హీరోయిన్‌కు వారు అవకాశం ఇస్తున్నారు. ఆమె ఎవరంటే ఒకప్పటి హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో హీరోయిన్గా నటించి అందులో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి తరుచూ సినిమాలో కనిపిస్తున్న సంగీత.. మెగా హీరోల సినిమాలలో మాత్రం కచ్చితంగా నటిస్తుంది.
ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో సంగీత ఓ పాటలో కనిపించింది. సినిమా రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీనియర్ భామ మరో మెగా హీరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా సంగీత ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈమె ఈ సినిమాలో నటించడం మెగా అభిమానులకు షాక్ ఇస్తుంది. ఆమె మెగా హీరోల సినిమాలలో నటిస్తే ఆ సినిమా ప్లాఫ్ అవుతుంది అన్న సెంటిమెంట్ మెగా అభిమానుల్లో గట్టిగా ఉంది.
రీసెంట్ గా మసూద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగీత ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మెగా హీరోల సినిమాలో సంగీత పక్క అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో హిట్ కొట్టి ఈమె బ్యాడ్ సెంటిమెంట్ పోగొట్టుకుంటుందో లేదో చూడాలి. సంక్రాంతికి అనుకున్న హరి హర వీరమల్లు మూవీ సమ్మర్ కి కూడా వస్తుందో లేదో తెలియదు అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. హరీశ్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే సుజిత్ తో సినిమా కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్.