రూ. 15 కోట్ల టార్గెట్‌.. 3 రోజుల్లో `హిట్ 2` ఎంత వ‌సూల్ చేసిందో తెలిస్తే షాకే!

గ‌త వారం విడుద‌లైన చిత్రాల్లో `హిట్ 2` ఒక‌టి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి ఇందులో జంట‌గా న‌టించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

డిసెంబ‌ర్ 2న విడుద‌లై ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు, రెండొవ రోజు రూ.3.28 కోట్ల షేర్ ను అందుకున్న ఈ చిత్రం.. మూడొవ రోజు రూ. 3.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకుంది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 మూడు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 5.10 కోట్లు
సీడెడ్: 1.15 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.41 కోట్లు
తూర్పు: 68 ల‌క్ష‌లు
పశ్చిమ: 45 ల‌క్ష‌లు
గుంటూరు: 68 ల‌క్ష‌లు
కృష్ణ: 63 ల‌క్ష‌లు
నెల్లూరు: 41 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 10.51 కోట్లు(17.10 కోట్లు~ గ్రాస్‌)
———————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.20 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.20 కోట్లు
————————————
వైర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 14.91 కోట్లు(26.20 కోట్లు~ గ్రాస్‌)
————————————

కాగా, ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అయితే మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 14.91 కోట్ల రేంజ్ లో షేర్‌ను సొంతం చేసుకుని అంద‌రినీ షాక్ అయ్యేలా చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్ మోస్ట్ క్లోజ్ గా వెళ్ళిన ఈ సినిమా 4వ రోజు వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్ట‌డం ఖాయమైంది.