అందాల ఆరబోతతో హీటెక్కిస్తున్న హిట్ 2 సుందరి… నాభి అందాల వడ్డన చూడండి!

నాచురల్ స్టార్ సమర్పణలో వచ్చిన హిట్ 2 చిత్రం తాజాగా రిలీజై సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు నేడు టాలీవుడ్లో బాగానే వినబడుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఇంతకు మునిపే మీనాక్షి చౌదరి ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి రావలసిన పేరు రాలేదు.

ఇలాంటి తరుణంలో హిట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసింది అమ్మడు. ఇక ఈ సినిమా చూసిన సినిమా పండితులు మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. దాంతో కుర్రకారు కూడా ఈ ముద్దుగుమ్మపైన మనసు పారేసుకున్నారు.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఈమెకి దిమ్మతిరిగే ఫాలోయింగ్ వుంది. తాజాగా మీనాక్షి చౌదరి రెడ్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. సదరు రెడ్ డ్రెస్ లో మీనాక్షి నాభి సొగసు చూసిన కుర్రాళ్ళయితే ఇక కంటిమీద కునుకు మాయం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏది ఏమైనా సక్సెస్ ఉంటేనే చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంటుంది. ఆ పేరు అనతికాలంలోనే సంపాదించిన మీనాక్షికి సినిమా కెరీర్ కి ఇక తిరుగు ఉండదని ప్రముఖ సినిమా జ్యోతిష్యుడు వీణావాణి భర్త ఓ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

Share post:

Latest