బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా 15వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సంయుక్త హీనన్ హీరోయిన్ గా ఎంపిక అయింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నారు. అయితే నేడు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను బయటకు వదిలారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు `విరూపాక్ష` అనే టైటిల్ ఖరారు చేశారు.
అయితే విరూపాక్ష గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. `అమ్మా.. హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు నీకో విషయం చెప్పలేకపోయా.. ఇప్పుడు చెబుతున్నా.. సారీ నన్ను క్షమించు అలాగే లవ్ యూ అమ్మా. నేను ఈ సినిమా చేసింది, ఇంత కష్టపడింది నీకోసమే` అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. `2007లో ఫస్ట్ టైమ్ నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నావో, ఇప్పుడు కూడా అలానే ట్రీట్ చేశావు. వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చాలా థాంక్యూ తారక్. ఎవరు ఏమనుకున్నా నీ స్నేహం ఎప్పటికి నాతో ఇలానే ఉండాలి` అని పేర్కొన్నాడు.