ఎన్టీఆర్ రాజకీయాలలో రాణిస్తారా.. లేదా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజీ వద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ లో విభిన్నమైన టాలెంట్లు ఉన్నాయని ఆయన అభిమానులు చెప్పడమే కాకుండా ఎన్నోసార్లు మనం చూసే ఉన్నాము. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత భాషలో మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా పెద్దలకు ఇచ్చే గౌరవం కూడా అందరికంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అందుచేత ఎన్టీఆర్ రాజకీయాలలో కి రావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా స్పందించలేదు. అయితే ఎన్టీఆర్ జాతకంలో రాజకీయం యోగం ఉందా లేదా అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

Jr NTR turns 39: Telugu celebrities recall their association with RRR star  | Entertainment News,The Indian Express
ఒక ప్రముఖ జ్యోతిష్యుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు మారిపోతున్నాడని తెలియజేశారు. ఆ పార్టీలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తేనే ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాలలోకి వస్తారని ఒక జ్యోతిష్యులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు రాబోతున్నాయని తెలియజేసినట్లు తెలుస్తోంది.

Jr NTR is next CM of Andhra Pradesh, TDP activists erect banners in Prakasam
ఇక చంద్రబాబు జాతకం దృష్ట్యా ఆయన స్థానంలో వేరొకరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో సక్సెస్ అయిన వాళ్ళు రాజకీయాలలో కూడా సక్సెస్ అవుతారని తెలియజేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే పెను సంచలనాన్ని సృష్టిస్తారని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు కేవలం తన ఫోకస్ అంతా సినిమాల పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు నిజం కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Share post:

Latest