అర్జున్ సర్జా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మా పల్లెలో గోపాలుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అక్కడ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి నటుడిగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. పుట్టి పెరిగింది అంతా కర్ణాటకలోనే అయినా కూడా సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది. కేవలం నటుడు గానే కాదు వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి అని చెప్పడంలో సందేహం లేదు. ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోవడం.. ఎవరిని కూడా విమర్శించడు.. చాలామంది హీరోలు మెచ్చిన గొప్ప నటుడుగా కూడా అర్జున్ కి మంచి పేరు ఉంది.
ఇక ఈయన తండ్రి కూడా నటుడు కావడం వల్ల అర్జున్ కూడా నటుడు కావాలని అనుకోలేదు. కానీ ఈయన పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేది. ఇతడి అన్న కిషోర్ సినిమా డైరెక్టర్ అయితే అనుకోకుండానే అర్జున్ సినిమాలోకి రావడం జరిగింది. నివేదిత అనే హీరోయిన్ ని అర్జున్ వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కూతుర్లు జన్మించారు. వీరిలో పెద్దమ్మాయి ఐశ్వర్య కూడా హీరోయిన్గా సినిమాలలో నటిస్తోంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆస్తులతో పాటు ఆయన కూడా బాగానే కూడబెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాపర్టీ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
అర్జున్ హనుమాన్ భక్తుడు.. అందుకే 35 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో కూడిన ఒక హనుమాన్ గుడిని కూడా కట్టిస్తున్నాడు. ఆయన కెరియర్ మొత్తం మీద 100 చిత్రాలకు పైగా నటించాడు. సింహడా మరి సైన్య అనే సినిమాలో మొదటగా నటించగా ఈ సినిమా కోసం 30 వేల రూపాయల పారితోషికం అందుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 9 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకి కూడా 3కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు గ్యారేజీలో 5 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.7 కోట్ల వరకు ఉంటుంది. మధుగిరి కర్ణాటకలో రూ.15 కోట్ల విలువ చేసి ఇల్లు ఉంది. అంతేకాదు భార్య , కూతుర్ల పేరు మీద మొత్తంగా కలిపి రూ.400 కోట్ల ప్రాపర్టీ ఉంటుందని సమాచారం.