టాలీవుడ్ లో హీరోయిన్ ప్రణీత సుభాష్ బాపు బొమ్మగా పేర్కొంది. ఇక ఎన్నో సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్గా మాత్రం స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ గత ఏడాది మార్చి 31 తేదీన బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుంది. ఇక వెంటనే గర్భవతి కావడంతో పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అటుతల్లిగా, నటిగా రెండు బాధ్యతలు స్వీకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన భర్త అనుమతితో హీరోయిన్గా ప్రణీత తన కెరీర్ ని కొనసాగిస్తోంది ప్రస్తుతం ఆమె రామన అవతార అని కన్నడ సినిమాలో నటిస్తున్నది.
టాలీవుడ్ లో మాత్రం ఇమే ఫెడవుట్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రణీత వరుసగా రెండు చిత్రాలు నటించి న పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లాక్ డౌన్ సమయంలో ఎంతమంది పేదలకు అవసరమైన ఆహారాన్ని కూడా తన సొంత ఖర్చులతో అందించింది ఈ ముద్దుగుమ్మ.
వివాహమైన తర్వాత తరచూ సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ పెట్టింది ప్రణీత. దీనివల్ల ఎన్నోసార్లు ట్రోల్స్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్నిసార్లు తన భర్తతో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేయడం వల్ల కొంతమంది ఈమెను తప్పుపడుతూ ఉన్నారు. అయితే తన మీద ట్రోల్ చేసే వారికి కూడా దీటైన సమాధానం తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ప్రణీత తన కూతురుకు సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నేటిజన్స్ సైతం తల్లిని మించిన అందంతో ప్రణీత కూతురు ఉందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
View this post on Instagram