టాలీవుడ్ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కమెడియన్ ఆలీ పలు బాధ్యతలు స్వీకరించారు. ఇక తన స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న పనులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తుందని జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టిలను కూలుస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ పలు ఆరోపణలు చేయడం జరిగింది.
అయితే ఈ విషయంపై ఆలీ,పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం జరిగింది.ఈ మేరకు తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడిన ఆలీ ప్రభుత్వం అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తుందని తెలియజేశారు. తనకు తెలిసి ఆరోపణలు కరెక్ట్ కాదని ప్రజలు ఆదరణ పొందిన వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపించాలని తెలియజేశారు. ప్రజలు ఊరకనే తీసుకొచ్చి చేతులు పెట్టేయలేదు మీ పాలన బాగుంటుంది అద్భుతమవుతుందని,స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని నమ్మకంతోని ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలియజేశారు. మొన్న షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఆ బీచ్లు కానీ, రోడ్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. కానీ అప్పట్లో డెవలప్మెంట్ లేని రోజుల్లో కూడా షూటింగ్ కూడా జరిగాయి. కానీ ఇంత డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాదు ఇతర భాష సినిమాలు కూడా మన దగ్గరికి వస్తాయని చెప్పారు అలీ..
షూటింగ్కు 100 నుంచి 150 మంది వస్తారని ఒకవేళ చెన్నై నుంచి షూటింగ్కు వస్తే వాళ్లంతా హోటల్స్ లో ఉంటారని వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి కాలు స్థలాలు బీచ్లు కావాలని వీటన్నిటికీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారని అదంతా ప్రభుత్వానికి ప్రజలకే కదా అంటూ తెలియజేశారు ఆలీ. ఇంకా మనం ఎదగాలి మనం ఎదుగుతూనే ఉండాలి అని తెలియజేశారు ఆలీ. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆలు గుర్తుకు చేస్తూ ఇరుకుల బతుకుతున్న ప్రజలకు వసతి కల్పించాలని ఏపీ ప్రభుత్వం వారి కోసం పలుస్తారాలను కూడా కేటాయించింది అని తెలియజేశారు ఆలీ.