బంపర్ ఆఫర్ కొట్టేసిన సుధీర్..పాన్ ఇండియా హీరో తో ఛాన్స్..!?

సుడిగాలి సుధీర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తన పేరుని పాపులర్ చేసుకున్న సుడిగాలి సుధీర్ ..కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత హోస్ట్ గా..ఇప్పుడు హీరోగా రాజ్యం ఏలుతున్నాదు. ఈ కమెడియన్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు . సెలబ్రిటీల కొడుకులే ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వలేక అల్లాడుతుంటే.. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా అవకాశాలు దక్కించుకొని హీరోగా సినిమాలు చేసి హ్యూజ్ సక్సెస్ అందుకున్న సుధీర్ పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది.

సుడిగాలి సుధీర్ర్ రీసెంట్గా నటించిన సినిమా గాలోడు . ఈ సినిమా ఎలాంటి పాజిటివ్ టాక్ దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సినిమా కోసం ప్రమోషన్స్ చేయకపోయినా సరే ఈ సినిమాను జనాలు బాగా ఆదరించారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ సన్లు కూడా ఇలాంటి క్రేజ్ ను తగ్గించుకోలేకపోయారు . అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుధీర్ ఈ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు .

కాగా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఆయన ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాలో సుడిగాలి సుధీర్ కు ఓ పాత్ర ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ పాత్ర చిన్నది. అయినా చాలా డెప్త్ ఉన్న రోల్ అని సినీవర్గాలనుంచి టాక్ వినిపిస్తుంది. వన్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ప్లాన్లో ఉన్నాడట కొరటాల శివ. ఏది ఏమైనా సరే పాన్ ఇండియా హీరో లాంటి ఎన్టీఆర్ సినిమాలో సుడిగాలి సుధీర్ ఛాన్స్ దక్కించుకోవడంతో ఫాన్స్ ఎగిరి గంతేస్తున్నారు..!!