యాపిల్ బ్యూటీ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. స్నేహితులు, బిజినెస్ పార్ట్‌నర్ అయిన సోహాల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు నడవబోతోంది. డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతోంది.
నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్` వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. రీసెంట్ గా పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.
తాజాగా హన్సిక గ్రీస్ లో బ్యాచ్‌లర్ పార్టీ ఘనంగా చేసుకుంది. అక్కడ తన ఫ్యాండ్స్ తో కలిసి ఫుల్ గా చిల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను హన్సిక స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/ClbWek6DpFT/?utm_source=ig_web_copy_link