ఈ మధ్య కుర్ర యాంకర్ దీపికా పిల్లి గురించి ఫిలిం నగర్లో అనేక రకాల గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వారు హాట్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోగా… తాజాగా దీపికా వారికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తోంది. అందంగా, చలాకీగా మాట్లాడుతూ కనిపించే యాంకర్స్ మన తెలుగు కుర్రాళ్లకు ముఖ్యంగా నచ్చేస్తారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపు సొంపులతో దీపికా పదుకొనెలాగా స్టైల్ కొడుతోంది. ఇక దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లకి గాలం వేస్తోంది. ఆమె చిరునవ్వులు చిందిస్తుంటే కుర్రాళ్ళు ఆహా, ఓహో అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో ఇపుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం దీపికా పిల్లి మాల్దీవుల్లో వెకేషన్ లో వుంది. ఈ కూల్ వెదర్ లో ఆమె సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తూ తన అందాలను ఆరబోస్తోంది. జింక పిల్లలా చిలిపిగా గెంతుతూ తన అందాలని వడ్డిస్తోంది.
ఇలా దీపికా రెచ్చిపోతే మాత్రం టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని కొంతమంది జోష్యం చెబుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి ‘వాంటెడ్ పండుగాడ్ ‘ అనే చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసిన సంగతి విదితమే. ముఖ్యంగా ఆమె నడుము అందాలు తమకి పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి అని నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ తరహాలో దీపికా గ్లామర్ కంటిన్యూ చేస్తే మాత్రం ఇక అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ఇక తట్టాబుట్టా సర్దేసుకోవడం ఖాయమని కొందరు అంటున్నారు.