నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది.
బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ హిట్ మూవీకి సీక్వెల్ ఉందంటూ తాజాగా బాలయ్య కన్ఫామ్ చేశారు. గోవాలో నిర్వహిస్తున్న 53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో రీసెంట్గా `అఖండ` చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ కు బాలయ్య, బోయపాటి తో పాటు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని, త్వరలోనే అధికారక ప్రకటన వస్తుందని ఆయన వెల్లడించారు. ఈయన ప్రకటనతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య `వీర సింహారె`డ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి తో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నాడు. ఆ తర్వాత అఖండ సీక్వెల్ ఉండొచ్చని అంటున్నారు.