US న్యూస్ పేపర్‏ మొదటి పేజీలో రాజమౌళి… జక్కన్న క్రేజ్ దిగంతాలకు చేరింది!

ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సెలిబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకొనేలా చేసాడు. అదే మార్గంలో నేడు ఎంతోమంది సౌత్ ఫిలిం మేకర్స్ పయనిస్తున్నారు అంటే అది అంతా రాజమౌళి చలవే అని అనుకోవాలి. ఇక ఇప్పుడు RRR మూవీతో యావత్ ప్రపంచాన్నే తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అవును, మన జక్కన్న aహాలీవుడ్ దర్శకులను సైతం మెప్పించారు.

రాజమౌళి స్క్రీన్ ప్లే, టేకింగ్‏కు తెల్ల బాబులు ఫిదా అయిపోతున్నారు. RRR సినిమా ఇప్పటికీ విదేశాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మొన్నటి వరకు జపాన్‏లో సందడి చేసిన రాజమౌళి.. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ RRR సినిమాను ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‏లో వరుసగా పాల్గొంటున్నాడు. దాంతో రాజమౌళి అంటే అక్కడివారు సైతం పడి చేస్తున్నారు. అమెరికా మీడియా, ప్రేక్షకులు జక్కన్నతో ఇంట్రాక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది.

అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్‏లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో జక్కన్న పై స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఈ పత్రికలోని మొదటి పేజీలో పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ ని మనం చూడవచ్చు. అందులో RRR చిత్రాన్ని ప్రస్తావిస్తూ.. జక్కన్నని ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. జక్కన్న పై ఆర్టికల్ రావడంతో తెలుగు సినిమా ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. ఒక టాలీవుడ్ దర్శకుడి గురించి అమెరికాలోని ప్రముఖ పత్రికలో మొదటి పేజిలో రావడం తెలుగు సినీ ప్రముఖులందరికీ పెద్ద విజయం లాంటిదని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది భారతీయ సినిమాకి గర్వకారణం అని చెప్పుకోవాలి.