ఇంట్రెస్టింగ్: బన్నీ దగ్గరున్న 12 కాస్ట్లీ వస్తువులు ఇవే..వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలిజ్ అవ్వ‌క‌ముందు తెలుగు- మలయాళం లోనే ఆయన సినిమాలు రిలీజ్ అయ్యేవి. మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన పుష్ప సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవటమే కాకుండా… 2021వ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పుష్ప పార్ట్ 2కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ఈ సీక్వల్ కు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

5 super-expensive things Allu Arjun has spent multiple crores on | GQ India

ఇక దింతో అల్లు అర్జున్ క్రేజ్ సోషల్ మీడియాలో అమాంతం పెరిగిపోయింది. తనకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన నిమిషాల్లో వైరల్ చేసేస్తున్నారు. తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడానికి అతని అభిమానులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పుష్ప సినిమా కోసం బన్నీ రూ.60 కోట్ల భారీ పారితోషకం తీసుకున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి, తన దగ్గర ఉన్న ఖరీదైన 12 వస్తువుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Allu Arjun Luxury Life | Net Worth | Salary | Business | Cars | House  |Marriage Family | Biography - YouTube

1. లావిష్ హౌస్..

జూబ్లీ హిల్స్‌లో బ్లెస్సింగ్ పేరుతో ఎంతో ఖ‌రీదైన‌ లావిష్ హౌస్ ఉంది బన్నీకి.. దీని విలువ 60 నుండి 80 కోట్ల వరకు ఉంటుంది. అలాగే కోకాపేట్‌లో 50 కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల స్థలం కూడా ఉన్నాయి..

2. ఫాల్కన్ వానిటీ వ్యాన్..

సెలబ్రిటీల్లో చాలా తక్కువ మందికి ఓన్ కారవాన్ ఉంటుంది.. అలాగే బన్నీ తన టేస్టుకి తగ్గట్టు మంచి ఫెసిలిటీస్‌తో ఓ ఫాల్కన్ వానిటీ వ్యాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. దీని కాస్ట్ 7 కోట్లు..

3. బెంట్లీ కాంటినెంటల్ కార్..

ఐకాన్ స్టార్ ఓసారి ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తూ.. బెంట్లీ కాంటినెంటల్ కార్‌లో కనిపించాడు.. దీని ధర 3.29 కోట్లు..

From Allu Arjun's Rs 7 crore vanity van to Prabhas' Rolls Royce: Super  expensive things owned by South superstars

4. రేంజ్ రోవర్ వోగ్..

‘పుష్ప’ బ్లాక్ బస్టర్ తర్వాత రూ. 3 నుండి 4 కోట్ల వరకు ఉండే లగ్జరీ రేంజ్ రోవర్ వోగ్ కొన్నాడు అల్లు అర్జున్..

5. జాగ్వార్ ఎక్స్‌జెఎల్..

తన దగ్గరున్న కార్లలో జాగ్వార్ XJL వైట్ కార్ కూడా ఒకటి.. దీనికి బన్నీ ఫేవరెట్ లక్కీ నంబర్ 0666 ఉంటుంది. 1.2 కోట్లు.. దాన్నీ కోసం ఖార్చు చేశాడు.

6. బీడబ్స్ ఫ్రాంఛైజీ..

సొంతంగా B.DUBS రెస్టారెంట్ ఫ్రాంఛైజీ ఉంది.. దీని నెట్ వర్త్ 1 నుండి 2 కోట్ల వరకు ఉంటుంది..

These are the most expensive things owned by Telugu superstar Allu Arjun

7. అల్లు అర్జున్ హమ్మర్ H2..

తన దగ్గర 85 నుండి 95 లక్షల కాస్ట్ ఉండే హమ్మర్ H2 బీస్ట్ కార్ కూడా ఉంది..

8. బ్రెయిట్లింగ్ నావిటిమర్ వాచ్..

15 లక్షల ఖరీదు చేసే బ్రెయిట్లింగ్ నావిటిమర్ B01 క్రోనోగ్రాఫ్ (Breitling Navitimer B01 Chronograph) అనే స్టైలిష్ వాచ్ ఉంది..

9. హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్..

అల్లు అర్జున్ మరో సందర్బంలో హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్ (Hublot Big Bang Steel Carbon) చేతి గడియారంతో కనిపించాడు.. దీని విలువ రూ. 10.25 లక్షలు..

10. కార్టియర్ శాంటాస్ 100XL..

ఐకాన్ స్టార్ ధరించే కార్టియర్ శాంటాస్ 100XL (Cartier Santos 100XL) మోడల్ వాచ్ కాస్ట్.. రూ.4.44 లక్షలు..

11. బ్రెయిట్లింగ్ అవెంజర్ హరికేన్ 45..

బన్నీ దగ్గర బ్రెయిట్లింగ్ బ్రాండ్‌లో మరో మోడల్ కూడా ఉంది.. అదే బ్రెయిట్లింగ్ అవెంజర్ హరికేన్ 45 (Breitling Avenger Hurricane 45) దీని కాస్ట్ రూ.4.51 లక్షలు..

12. ఫేవరెట్ నంబర్ 0666..

బన్నీకి 0666 అనేది లక్కీ అండ్ ఫేవరెట్ నంబర్.. తన దగ్గరున్న అన్నీ వెహికల్స్‌కి ఇదే నంబర్ ఉంటుంది.. ఈ 0666 నంబర్ కోసం కోట్లలో ఖర్చు చేస్తుంటాడు ఐకాన్ స్టార్..

 

Share post:

Latest