హ‌న్సిక భ‌ర్త‌కు ముందే పెళ్లైందా..? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాలు!

హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాలలో నటిస్తూ వాటిలో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లయిందనే వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన హన్సిక అభిమానులు పెళ్లయిన వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో హన్సిక భర్తకు పెళ్లి జరిగిందన్న విషయం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.

హన్సికకు కాబోయే భర్త పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో కాదు.. స్వయంగా హన్సిక ప్రాణ స్నేహితురాలే అని సమాచారం. అయితే తన ఫ్రెండ్ పెళ్లి సమయంలో డాన్స్ వేసిన హన్సిక ప్రస్తుతం ఆ వ్యక్తితో నే పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇప్పటికే పెళ్లయిన వ్యక్తిని ఎలా ప్రేమిస్తారు? పైగా హన్సిక తన ప్రాణ స్నేహితురాలని మోసం చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హన్సిక పెళ్లికి కేవలం నాలుగు వారాల టైం మాత్రమే ఉంది. ఇక ఈ పెళ్లి కారణంగా హన్సిక కెరీర్ ఇక్కడితో ముగిసిపోయే ప్రమాదం ఉందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్తలపై హన్సిక ఎలా స్పందిస్తుందో? చూడాలి.

Share post:

Latest