ప్రస్తుతం నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సాయి పల్లవి డాక్టర్ విద్యను అభ్యసించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె `ప్రేమమ్` అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. `ప్రేమమ్` సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగింది.
అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే మొదట్లో సాయి పల్లవి కెరీర్ ప్రారంభంలో టీవీ చానల్లో డాన్స్ షోలో పాల్గొనడం ద్వారా ఆమెకు సినిమా అవకాశాలు రావడం జరిగింది. అయితే తనకు లైఫ్ ఇచ్చిన ఆ డాన్స్ పోటీలని ఇప్పుడు విమర్శిస్తుంది. అంతేకాకుండా అలాంటి పోటీల పైన తనకు అస్సలు నమ్మకం లేదని చెబుతోంది.
తమిళంలో విజయ్ టీవీలో ప్రసారమైన `మీలో ఎవరు తదుపరి ప్రభుదేవా` అనే డాన్స్ పోటీలలో పాల్గొన్న సాయి పల్లవి ఆ పోటీల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే మొదటి బహుమతి గెలుచుకోవడానికి కారణం.. ధనబలం అంటూ ఆమె బాధ బయటపెట్టింది. ఇటీవల ఈ విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ డాన్స్ పోటీల్లో ప్రతిభకు ఎప్పుడు గౌరవం లేదని.. తన అక్కస్సును వెలగక్కింది.
అంతేకాకుండా సాధారణంగా టీవీ ఛానల్లో డబ్బుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రముఖుల వారసులకు మరియు సెలబ్రిటీలకు అలాంటి మర్యాద ఇస్తారని అందుకే తనకు డాన్స్ పోటీలు అంటే నమ్మకం లేదని.. అలాంటివంటే అసహ్యం అంటూ.. ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.