సోషల్ మీడియాలో ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మేటర్ కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య వార్. ఎప్పుడో ఏదో జరిగినా వార్ ని సోషల్ మీడియా వేదిక గా కొందరు కావాలని పైకి లేపుతూ రష్మిక మందన ను ట్రోల్ చేస్తున్నారు . అప్పుడెప్పుడో తన కెరియర్ మొదలుపెట్టిన కిరిక్ పార్టీ అనే సినిమాను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే రష్మిక మందన కిర్రిక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైంది.
ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టి . ఈ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇక తర్వాత రష్మిక మందన తన రూట్ మారుస్తూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంది . అయితే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారా సినిమాను మీరు చూశారా అని రష్మిక ని అడగ్గా.. నేను ఇప్పటివరకు చూడలేదు అని చెప్పడం షాకింగ్ అనిపించింది . ఈ సినిమాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చూశారంటూ వార్తలు వినిపించాయి. అలాంటి సినిమాలు నువ్వు చూడలేదా ..? పైగా నువ్వు కన్నడ అమ్మాయివి ..నీ సొంత ఇంటి సినిమాను నువ్వు చూడలేదా ..? అంటూ జనాలు రష్మిక పై మండిపడ్డారు .
దీంతో అసలు విషయం ఆరా తీయగా అప్పుడు ఎప్పుడో రిషబ్ శెట్టికి – రష్మిక కి గొడవలు జరిగాయని ..రిషబ్ శెట్టిను రష్మిక చులకనగా మాట్లాడిందని ..ఆ కారణంగానే రష్మిక ఆయన సినిమాను చూడలేదంటూ న్యూస్ బయటపడింది . కాగా రీసెంట్ ఇంటర్వ్యూ లో రష్మికపై పరోక్ష కామెంట్స్ చేశారు రిషెబ్ శెట్టి. ముగ్గురు హీరోయిన్ల పేరు చెప్పి వాళ్ళలో ఎవరితో సినిమా చేస్తారంటే రష్మిక పేరు తప్ప మిగిలిన ఇద్దరు హీరోయిన్ పేర్లు మెన్షన్ చేశాడు. అంతేకాదు ఇక ఆమె గురించి మాట్లాడుకోవడం అనవసర అంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోని రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసే ఆలోచనలో ఉందని కూడా వార్తలు వినిపించాయి . కాగా ఇలాంటి టైం లోనే రష్మిక మందన్నా తన జాతకం బాగోలేదని ..తను ఎక్కువగా నమ్మే వేణు స్వామిని రహస్యంగా మీట్ అయినట్టు కన్నడ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . తను ఇలాంటి ట్రోలింగ్ బాధలనుంచి తప్పించుకోవడానికి ..తను మళ్లీ యధావిధిగా సినిమాలు చేసుకోవడానికి శాంతి పరిహార పూజలు చేస్తుందట . ఏది ఏమైనా సరే ఈ పూజల ద్వారా అయినా రష్మిక ట్రోలింగ్ బాధల నుంచి తప్పించుకుంటే మేలు అంటున్నారు ఫాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?