యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం `హనుమాన్`. ఈ మైథలాజికల్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంటే.. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల బయటకు వచ్చిన హనుమాన్ టీజర్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ తో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో హనుమాన్ కు కళ్ళు చెదిరే రీతిలో బిజినెస్ జరుగుతోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ హనుమాన్ కు రూ. 15 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో ఆఫర్ చేశారట.
ఈ మూవీ బడ్జెట్ రూ. 20 కోట్లకు లోపే ఉంటుంది. ఈ లెక్కన హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారానే బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోయిందని నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. అలాగే అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్ల రేంజ్ లో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకుని రూ. 200 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఒక యంగ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం నిజంగా విశేషం అనే చెప్పాలి.