సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గా నిలదొక్కుకున్న అక్కా చెల్లెల్లు లిస్ట్ ఇదే!

తెలుగు సినిమానే కాకుండా యావత్ భారతీయ సినిమాని తీసుకుంటే ఇక్కడ మనకు అనేకమంది తారలు తళుక్కున మెరిశారు. అందులో ఇండిపెండెంట్ గా వచ్చెనవారే ఎక్కువ. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. వారిలో ముందువరుసలో ఉంటుంది సినీ నటి నగ్మా. అవును, తన అందంతో, నటనతో పలు భాషలలో నటించిన నగ్మా ఫామిలీ నుండి మరో ఇద్దరు హీరోయిన్లు వచ్చారని ఎంతమందికి తెలుసు? వాళ్లే జ్యోతిక, రోషిని. వీరు కూడా తమదైన ముద్రను వేశారు. ఇక జ్యోతిక తన తోటి నటుడు సూర్యను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి విదితమే.

ఇక రోషిణి మాత్రం చిరంజీవి మాస్టర్, బాలకృష్ణ పవిత్రప్రేమ సినిమాల్లో నటించి పర్సనల్ కారణాల చేత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వీళ్ల కంటే ముందు హీరోయిన్‌గా లక్ పరీక్షించుకున్న సిల్వర్ స్క్రీన్ సిస్టర్స్ కూడా వున్నారు. ప్రస్తుతం వారిలో స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా కృతి సనన్ చెల్లెలు అయినటువంటి నుపూర్ సనన్ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ఇక కృతి సనన్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసినదే.

ఇక ఇక్కడ అలనాటి నటి షావుకారు జానకి గురించి చెప్పుకోవాలి. ఆమె చెల్లెలు కృష్ణ కుమారి గురించి అందరికీ తెలిసినదే. షావుకారి జానకి తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్, కన్నడలో రాజ్‌కుమార్‌లకి జంటగా నటించింది. ఈమె బాటలోనే ఆమె చెల్లెలు కృష్ణకుమారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. అక్కను మించి చెల్లెలుగా పేరు సంపాదించింది. వీరి తరువాత కార్తీక నాయర్, తులసి నాయర్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు పలు సినిమాలలో నటించారు. కార్తీక తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. తులసి పలు సినిమాలలో నటించగా ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టింది.