హీరోయిన్ పూజా హెగ్డే ఇంట త్వరలో పెళ్లి బాజాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా లక్కీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో దాదాపుగా నటించిందని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మూడు,నాలుగు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉంది పూజ హెగ్డే. ఈమె కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు.దీంతో ఈమె వివాహం కాస్త ఆలస్యం అవుతుందని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు.

వైరల్ అవుతున్న పూజాహెగ్డే బ్లాక్ శారీ ఫోటోస్ | Pooja Hegde Black Shari  Photos Going Viral– News18 Telugu
అయితే ఈమె కంటే ముందు పూజా హెగ్డే అన్నయ్య వివాహం జరిగేలా కనిపిస్తోంది. ఎందుచేత అంటే రీసెంట్గా అతడు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పూజ హెగ్డే తెలియజేస్తూ ఎమోషనల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన పూజ హెగ్డే ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక అల్లు అర్జున్తో కలిసి దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.


ఇక ఆ తర్వాత రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత అలా వైకుంఠపురం, రాదే శ్యామ్, మహర్షి,అరవింద్ సమేత తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికయింది. ఇక పూజ హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే , శివానీతో ఎంగేజ్మెంట్ అక్టోబర్ 16న బెంగళూరులో చాలా గ్రాండ్గా జరిగింది. అందుకు సంబంధించి విషయాన్ని తెలియజేసింది పూజా హెగ్డే.