365 రోజుల్లో 308 రోజులు అదే పని..రణవీర్ సింగ్ పరువు తీసేసిన స్టార్ హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ ఏదైనా రియాల్టీ షో కి వస్తే నోటికి హద్దు అదుపు లేకుండా ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ బాలీవుడ్ స్టార్స్ అస్సలు ఆలోచించట్లేదు . నోటికి వచ్చిన మాటను ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు. ఆ తర్వాత సరదాగా అన్నాను.. జోక్ చేశాను.. జస్ట్ చిల్ అవుట్.. కిడ్డింగ్ అంటూ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి.

రీసెంట్గా “కేస్ తో బంతా హై” అనే కామెడీ షో లో భాగంగా సంజయ్ నిందితుడిగా కనిపించగా.. రితీష్ దేశముఖ్, వరుణ్ శర్మ లాయర్ పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే సంజయ్ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసారు . అంతేకాదు షో ని నలుగురు చూస్తున్నారు ఆడపిల్లలు చూస్తున్నారని పద్ధతిపాడు లేకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడేశారు. ” ఈ క్రమంలోని సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి.. అందులో నీకు 308 లవర్స్ ఉన్నారు.. మరి మిగతా 57 రోజులు ఆదివారం సెలవు కాబట్టి వదిలేసావా..” అని మాట్లాడటం షోలో ఛండాలంగా మారింది.

Sanjay Dutt Explains Why Ranveer Singh Can't Portray The 'Khal Nayak'

అంతే కాదు అక్కడున్న అమ్మాయిలకు అది ఇబ్బంది పెట్టే ప్రశ్నగా మారింది . దీంతో ఒక్కసారిగా సంజయ్ పేరు సోషల్ మీడియాలో మారం వైరల్ గా మారింది. అంతే కాదు ఓ టాస్క్ లో భాగంగా మాట్లాడుతూ సంజయ్ దత్ ” ఈ మధ్యకాలంలో రన్వీర్ సింగ్ ఒంటిమీద బట్టలు అస్సలు నిలవట్లేదు ..వేసుకోలేకపోతున్నాడు.. కాబట్టి ఆయన తీస్తే ఒరిజినల్ అందాలు చూసి జనాలు భయపడతారు” అంటూఘాటు కామెంట్స్ చేసాడు. దీంతో ఒక్కసారిగా రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో గ్రఫీ సోషల్ మీడియాలో మళ్లీ మారుమ్రోగిపోతుంది. ఏది ఏమైనా సరే సంజయ్ దత్ ఇలా హద్దుల మీరి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులు .మరి చూడాలి…సంజయ్ దత్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడో..?