యాక్టర్ నందుపై యాంకర్ రష్మి సీరియస్… అవకాశం ఇస్తే వాష్ రూమ్ లోకి కూడా వచ్చేస్తావా?

యాక్టర్ నందు, ప్రముఖ సింగర్ గీతా మాధురి భర్త నందుపై హాట్ యాంకర్ రష్మీ సీరియస్ గా వుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిని విసిగించేలా.. అలాగే ఆమెకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేయడంతో ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నందు చేసింది ఫ్రాంక్ వీడియో కావచ్చు, కాని నేను చెప్పిన సమాధానం మాత్రం ప్రాంక్ కాదు. నేను నిజంగానే ఆ మాటలు అన్నాను అని రష్మి తాజాగా చెప్పుకొచ్చింది.

విషయం ఏమంటే, నందు హీరోగా, రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన సినిమా పేరు బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మూవీ తన రిలీజులను ఎప్పటికప్పుడు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ చాలా గ్యాప్ తరువాత నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది. అయితే ఈమూవీ టీమ్ కు టైమ్ తక్కువ ఉండంతో సడెన్ గా పబ్లిసిటీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రష్మీ ప్రమోషన్స్‌కి రావడంలేదు… ఆమె దొరకలేదు? అంటూ హీరో నందు ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అందులో రష్మీని కలిసి నువ్వు ఎందుకు ప్రమోషన్స్‌కు రావు? అంటూ నందు నిలదీస్తాడు దానికి కోపం వచ్చిన రష్మీ.. షాకిచ్చే సమాధానం చెబుతుంది.

అదేమంటే, రష్మి ఆ సమయంలో ఓ షూటింగ్ లో పాల్గొంటుంది. అక్కడికి వెళ్లి నందు ఆమెని డిస్టర్బ్ చేయడం వలన.. ఆమె సీరియస్ అవుతూ… ‘ఏంటి ఇక్కడికి వచ్చేసావ్.. అవకాశమిస్తే వాష్ రూమ్ లోకి కూడా వచ్చేటట్టు వున్నావ్?’ అని సీరియస్ అవుతుంది. అంతేకాకుండా కోపంతో నేను ప్రమోషన్ కు రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కోపంగా అంటుంది. ఈ విషయాలే ఆమె తాజాగా ఓ మీడియా వేదికగా ప్రస్తావించారు. ఇకపోతే ఇలాంటి ప్రాంక్ వీడియోలు ఇపుడు మామూలు అయిపోయాయి.