ఛీ ఛీ..రోహిణి నోట పచ్చి బూతు మాట.. మండి పడుతున్న జనాలు..!!

జబర్దస్త్ షో పుణ్యమా అంటూ కొందరు కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అంతేకాదు మంచిగా ఆస్తులు ఏర్పరచుకొని లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు . అయితే జబర్దస్త్ వల్ల బాగుపడిన ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో.. జబర్దస్త్ కారణంగా బూతులు నేర్చుకున్న ఫ్యామిలీస్ కూడా అన్ని ఉన్నాయి అంటూ చెప్పుకోస్తున్నారు జనాలు. దానికి ముఖ్య కారణం రీసెంట్గా జబర్దస్త్ ప్రోమోలో కమెడియన్ సీరియల్ యాక్ట్రెస్ బిగ్ బాస్ రోహిణి మాట్లాడిన వల్గర్ కామెంట్స్ అంటూ తెలుస్తుంది.

లవ్​ ఫెయిల్యూర్​ అంటూ ఎమోషనల్​ అయిన​ రోహిణి.. అసలేమైంది? | Manalokam

రోహిణి ఈ పేరుకు ప్రత్యేక పరిచాల అవసరం లేదు . సీరియల్స్ ద్వారా తన కెరియర్ను ప్రారంభించిన రోహిణి ఆ తర్వాత ..మెల్లమెల్లగా తనలోని కామెడీ యాంగిల్ ను బయట పెడుతూ ..బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది . ఇక బిగ్ బాస్ లో ఒక్కసారిగా రోహిణి పేరు మారుమ్రోగిపోయింది. అయితే షోలో ఎవ్వరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

Jabardasth Rohini : రోహిణి కి ఎందుకు మల్లెమాల యొక్క బాండ్ వర్తించడం లేదు? | The Telugu News

ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత రోహిణికి వరుస అవకాశాలకు క్యూ కట్టాయి. కొన్ని సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ ప్రోగ్రాం లో కూడా స్కిట్స్ చేసింది . సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన డైలీ వ్లాగ్స్ ని అభిమానులతో పంచుకుంటూ తనదైన స్టైల్ లో కామెడీతో టైమింగ్ తో పంచులు వేస్తూ జనాలను కడుపుబ్బ నవ్విస్తుంది.

Jabardasth Rohini: బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి నటన మాములుగా లేదు.. నటనతో లేడీ సూపర్ స్టార్‌నే బుల్లితెరపై చూపించింది!– News18 Telugu

రీసెంట్గా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో రోహిణి వేసిన చెత్త కామెంట్స్ ఇప్పుడు ఆమెను ట్రోలింగ్ కు గురిచేస్తున్నాయి . “స్కిట్ లో భాగంగా డబ్బు ఉన్న అమ్మాయి కోసం భర్త తనకు విడాకులు ఇస్తాడు . ఆ నోటీసులు అందరికీ పంచుతూ.. నేను ఇప్పటినుంచి స్వేచ్ఛ జీవిని నన్ను ఎవరైనా గెలకవచ్చు ..గోకచ్చు..నా మనసు దోచుకోవచ్చు అని చెప్తుంది. అడ్రస్ ఎక్కడ అని అడుగుతాడు జడ్జి కృష్ణ భగవాన్. దీంతో ఈ స్కిట్ చాలా రోతగా అనిపిస్తుంది. అంతేకాదు దీనిపై రోహిణీని ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.