డేటింగ్ వాళ్లతో మాత్రం వద్దు.. సోదరికి జాన్వీ కపూర్ సలహా!

జాన్వీ కపూర్… తన అందం, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వి ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను కొన‌సాగిస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

గతంలో జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో మెయిన్ రోల్ నటించింది. అయితే ఈ సినిమా ధియేటర్లో కాకుండా డిస్నీ ప్లెస్ హాట్ స్టార్ `ఓటిటి` ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి విమర్శలు కాకుండా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈమె `మీలి` అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ తన సోదరి ఖుషి కపూర్ కి సలహాలు ఇవ్వవలసి వస్తే ఎలాంటి సలహాలు ఇస్తారన్న‌ ప్రశ్న ఎదురైంది.

ఆ విషయంపై జాన్వి కపూర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఒకవేళ డేటింగ్ చేయవలసి వస్తే నటుడితో మాత్రం అస్సలు డేటింగ్ చేయకూడదు అని తన సోదరికి సలహా ఇస్తాను అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను మరియు అతని సోదరి ఒకే మనస్తత్వంతో కలిగి ఉంటామని.. అలాగే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామని కూడా పేర్కొంది. అయితే జాన్వి కపూర్ సోదరి ఖుషి కపూర్ కూడా `ది ఆర్చీస్` అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా జాన్వి కపూర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి కూడా మంచి సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.