ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తూ ఎంతో ముద్దొస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. అచ్చం తెలుగు అమ్మాయిల కనిపించే ఈ హీరోయిన్ కు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్ల కలల రాకుమారిగా గుర్తింపు పొందింది.

 

అయితే అందం, అభినయం అంతకుమించి టాలెంట్ ఉన్న ఈ అమ్మడుకు ఆఫర్లు లేక సతమతం అవుతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదేనండి.. అదితి రావు హైదరి. హిందుస్థాని క్లాసికల్ సింగర్ విద్యా రావు వనపర్తి సమస్తానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు దంపతులకు అదితి జన్మించింది. యుక్త వయసులో నటనపై ఆసక్తి పెరగడంతో అదితి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

`సమ్మోహనం`, `అంతరిక్షం`, `వి` చిత్రాలతో నటనపరంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవల `మహాసముద్రం` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. తమిళ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసింది. కానీ ఎక్కడ స్టార్ హోదా దక్కలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కి ఆఫర్లు కూడా కరువయ్యాయి. కనీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వైపు చూడడం లేదు. మరి అదితి ఇక ముందు అయినా ఆఫర్లను అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.