`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు.

Chiranjeevi Acted In One And Only One Serial

త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. రీమేక్‌ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదర‌గొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు దర్శనమిస్తుందా అని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది .

ప్రముఖ సెన్సార్ సభ్యుడు, సినీ క్రిటిక్ ఉమైర్ సందు గాడ్ ఫాద‌ర్‌పై రివ్యూ ఇచ్చారు. `కొత్త సీసాలో పోసిన పాత సారాలా ఉంది గాడ్ ఫాదర్. బి అండ్ సి సెంటర్ ప్రేక్షకులకు, క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌కు ఏవరేజ్ సినిమా. చిరంజీవి మీకు విశ్రాంతి కావాలి. నేను 2.5 రేటింగ్ ఇస్తున్నాను` అంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశారు.

అలాగే మరో ట్వీట్ లో `చిరంజీవికి సాలిడ్ స్క్రిప్ట్స్ అవసరం. మాస్ రోల్స్ నుంచి బయట పడాలి. తెలివితక్కువ స్క్రిప్ట్‌లలో మీ ప్రతిభను వృధా చేసుకోకండి. మీరు మెగాస్టార్! అయితే, కథల ఎంపికలో సెన్స్ లేదు. గాడ్ ఫాదర్ ఏవరేజ్ సినిమా` అని పేర్కొన్నారు. దీంతో ఉమైర్ సందు ట్వీట్స్‌ వైర‌ల్‌గా మారాయి. అయితే ఉమైర్ సందు రివ్యూతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. `నువ్వు ఇలా అన్నావ్ అంటే సినిమా బ్లాక్ బస్టర్`, `వీడో పెద్ద ఫేక్.. ఎవరు నమ్మొద్దు. నోటికి వచ్చినట్లు రివ్యూలు ఇస్తాడు..` అంటూ ఉమైర్ సందును సోష‌ల్ మీడియా ఓ ఆట ఆడుకుంటున్నారు.