“యస్..నేను మెగా భజన చేస్తున్న..” దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గెటప్ శ్రీను..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన లిస్ట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ టైం లో గెటప్ శ్రీను మెగా భజన చేశాడని ..మాటకు ముందు చిరంజీవి.. మాటకు తర్వాత చిరంజీవి అంటూ ఆయన్ను ఓ రేంజ్ లో పొగిడేసారని జనాలు విపరీతంగా ఆడేసుకున్నారు. ఈ క్రమంలోని రీసెంట్గా ఓ స్కిట్ లో భాగంగా అలాంటి వాళ్లకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు గెటప్ శ్రీను.

కొద్దిసేపటి క్రితమే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో అంతా బాగానే ఉన్నా.. లాస్ట్ లో గాడ్ ఫాదర్ సినిమా స్పూఫ్ ను గెటప్ శ్రీను చేయడం సంచలనంగా మారింది . అంతేకాదు చిరంజీవిగా గెటప్ శ్రీను నయనతారగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటించడం చాలా కామెడీగా అనిపించింది . ఇక సత్యదేవ పాత్రలో ఆటో రాంప్రసాద్.. మరీ ముఖ్యంగా సల్మాన్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ కడుపునొప్పి తెప్పించే కామెడీ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ప్రోమోలో..” నేను ఉన్నంతవరకు ఆ కామెడీ చైర్ కి చెద పట్టనివ్వను ” అంటూ గెటప్ శ్రీను చెప్తున్న డైలాగ్ ఆసక్తికరంగా మారింది .

కాగా స్కిట్ అంతా అయిపోయాక ఖుష్బూ..” గెటప్ శ్రీను నడిచొస్తుంటే అచ్చం చిరంజీవి లానే ఉన్నావంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు “.ఈ క్రమంలోనే గెటప్ శ్రీను స్కిట్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ..”నన్ను ఈ సినిమా టైంలో చాలామంది మెగా భజన చేస్తున్నావన్నారు. అఫ్ కోర్స్ నిజమే.. నేను మెగా భజన చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి నాకు దేవుడు . దేవుడికి భజన చేయడంలో తప్పులేదు” అంటూ అతనిపై ట్రోల్ చేసేవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి సొంత జట్ ప్లేన్ లో గెటప్ శ్రీను ట్రావెల్ చేయడం మనం చూసిందే. మా వాడు చిరంజీవితో ప్రయాణించడం మా జబర్దస్త్ టీంకు ఎంతో గర్వకారణం అంటూ ఆటో రాంప్రసాద్ చివర్లో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.