బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే గోపీచంద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ కూడా పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండుగ అంటే బాలయ్య పండుగని మనం చెప్పవచ్చు. ప్రతి సంక్రాంతికి తన కొత్త సినిమాని విడుదల ఏ విధంగా బాలకృష్ణ చూసుకుంటాడు. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ బాలకృష్ణకు సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు కూడా బాలకృష్ణ సంక్రాంతి బరిలో తన సినిమాను దించబోతున్నాడు.
గతంలో బాలకృష్ణ సంక్రాంతికి బరిలోకి దింపిన సినిమా ఏవో తెలుసా..14 జనవరి 1987న భార్గవ రాముడు అనే సినిమాతో సంక్రాంతికి వచ్చారు బాలకృష్ణ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 15 జనవరి 1988న ఇన్స్ పెక్టర్ ప్రతాప్,12 జనవరి 1990 న ప్రాణానికి ప్రాణం, వంశానికొక్కడు ( 5 జనవరి 1996), పెద్దన్నయ్య( 10 జనవరి 1997), సమరసింహా రెడ్డి(13 జనవరి 1999), వంశోద్ధారకుడు ( 14 జనవరి 2000), నరసింహ నాయుడు ( 11 జనవరి 2001), సీమసింహం ( 11 జనవరి 2002), లక్ష్మీ నరసింహా ( 14 జనవరి 2004), ఒక్కమగాడు (8 జనవరి 2008) పరమవీర చక్ర ( 12 జనవరి 2011), డిక్టేటర్ ( 16 జనవరి 2016), గౌతమిపుత్ర శాతకర్ణి ( 12 జనవరి 2017), జై సింహా ( 12 జనవరి 2018), ఎన్టీఆర్ కథానాయకుడు ( 9 జనవరి 2019).
బాలకృష్ణ ఇప్పటివరకు సంక్రాంతి బరిలో తన 15 సినిమాలను విడుదల చేశాడు. వాటిలో సగానికి పైగా సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు 2023 సంక్రాంతికి తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని..నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.