MEGA 154: సినిమా పై బిగ్ అప్డేట్.. టీజర్ గ్లింప్స్ వైరల్..!!

చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెగా 154 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 24వ తారీఖున మాస్ బ్లాస్ట్ కి యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు అంటూ ఒక చిన్న గ్లింప్ ని విడుదల చేయడం జరిగింది. అందుకు ఒక్కరోజు ముందు అంటే రేపటి రోజున ఒక చిన్న గగ్లింప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

Chiranjeevi's Mega 154 title release plans announced- Cinema express
తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. చిరంజీవి మాస్ లుక్ లో ఉంటూ చేతిలో సిగరెట్.. చెవికి కమ్మ చూస్తూ ఉంటే చిరంజీవి ఈ చిత్రంలో చాలా మాస్ గెటప్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందించేలా ఈ తాజా వీడియో ఉండడంతో ప్రతి ఒక్కరు సంబరపడిపోతున్నారు. రేపు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు ఫాన్స్ అందరికీ అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లుగా మెగా అభిమానులు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు తెలియజేశారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మరింత హైప్ నెలకొంది. అయితే మొన్నటి వరకు ఈ చిత్రానికి వాల్తేరు వీరన్న అని టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టైటిల్ లో కూడా మార్పు ఉండవచ్చని అందుచేతనే కొత్త టైటిల్ ని కూడా మరింత మాస్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో రవితేజ కూడా నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.