IMDB ప్రకారం వరస్ట్ తెలుగు సినిమాలు ఇవే..!

సాధారణంగా సినిమా విడుదల వరకు ఏ సినిమా కైనా మంచి బజ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రివ్యూల కోసం గూగుల్ లో వెతికితే చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి రివ్యూలలో నిజాయితీ శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి…IMBD అనే వెబ్సైట్ ద్వారా రివ్యూలను తెలుపుతూ ఉంటుందిఆ సంస్థ. ఈ సైట్లో ఎక్కువ మంది ప్రేక్షకులు నచ్చిన సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తే నచ్చని సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా IMBD లో తక్కువ రేటింగ్ గల సినిమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Movie Reviews & rating - Entertainment news

లైగర్ఈ సినిమాకు 2.0 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ సినిమాకు కూడా 2.0 రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక వీరితోపాటు జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నటించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ను ఇమిటేట్ చేసీ ఆర్జీవి చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం పరాన్న జీవి సినిమాలో షకలక శంకర్ నటించిన ఈ సినిమాకు కూడా IMBD 2.0 రేటింగ్ను ఇచ్చింది.

Okka Magadu (2008) - IMDb
ఇక మరొకసారి బాలకృష్ణ నటించిన మహారథీ సినిమాకి కూడా ఇందులో 2.0 రేటింగ్ మాత్రమే లభించింది ఇక బాలయ్య హీరోగా నటించిన మరొక చిత్రం పరమవీరచక్ర కు కూడా దారుణమైన రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి ఏకంగా 1.8 రేటింగును ఇవ్వడం జరిగింది బాలయ్య కెరీర్ లో వచ్చిన మరొక డిజాస్టర్ చిత్రం ఒక్క మగాడు. ఈ సినిమాకు దారుణమైన రేటింగ్ రావడం జరిగింది IMBD లో కూడా ఈ సినిమాకు 1.8 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అన్నిటికంటే అతి తక్కువ దారుణమైన రేటింగ్ కలిగిన సినిమా మోహన్ బాబు నటించిన రగిలే గుండెలు.. ఈ సినిమాకు ఐఎండీబీ ప్రకారం 1.3 రేటింగ్ మాత్రమే సంపాదించింది. ఇందులో బాలకృష్ణకు సంబంధించి ఎక్కువ సినిమాలు చాలా దారుణంగా రేటింగ్ను సంపాదించాయి.