అభిమానులకు గుడ్ న్యూస్ .. మరో మెట్టు ఎక్కిన నాని..త్వరలోనే కొత్త మెంబర్..!?

సినీ స్టార్స్ అందరూ ఈ మధ్య వరుస పెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు . సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తీపి కబుర్లు వింటున్నాం. స్టార్ హీరో హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కాబోతున్నామంటూ అఫీషియల్ గా చెప్పిన జంటలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.. నాచురల్ స్టార్ నాని.
మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని కి ఇండస్ట్రీలో ఉండే రేంజ్ క్రేజ్ ఎలాంటిదో .

ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ..ఆ తర్వాత హీరోగా తనదైన స్టైల్ నటిస్తూ అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో యాక్టింగ్ నేచురల్ గా ఉంటుంది.. అందుకే అభిమానులు ముద్దుగా న్యాచురల్ స్టార్ నాని అంటూ పీల్చుకుంటూ ఉంటారు. అష్టా చమ్మా తో తన సినీ కెరియర్ ని ప్రారంభించిన నాని ఆ తర్వాత వచ్చిన సినిమాలలో చెప్పుకో తగ్గ సినిమాలుగా నిలిచిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మ్యాన్, మజ్ను జనాలకు మరింత దగ్గర చేశాయి. అంతేకాదు వరుస విజయాలతో నాని ఆ తరువాత ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాకుండా పర్సనల్ గా కూడాని జెడ్ స్పీడ్ తో దూసుకుపోయాడు.

శ్యామ్ సింగరాయ్ అనే సినిమా తో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ..దసరా అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. కాగా సినిమాల పరంగా ఎలా ఉన్నా త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు నాని అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఎస్ విశాఖపట్నం కు చెందిన అంజనాను నాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట .. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలుస్తుంది. నాని భార్య అంజన రెండోసారి గర్భం దాల్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నాని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని తండ్రిగా మరో మెట్టు ఎక్కాడని ..త్వరలోనే వీళ్ళ ఫ్యామిలీలోకి మరో నెంబర్ రాబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి దీనిపై హీరో నాని ఏ విధంగా స్పందిస్తారో..?

Share post:

Latest