ఉపాసన విషయంలో చిరంజీవికి అదొక్కటే కంప్లైంట్ ఉండిపోయిందట?

టాలీవుడ్లో మెగా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక అతని వారసుడిగా రామ్ చ‌రణ్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తున్నాడో మీకు తెలియంది కాదు. ఆయన సతీమణి ఉపాస‌న గురించి కూడా తెలిసినదే. చూడ‌ముచ్చ‌టైన జంట‌గా పేరు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పెళ్లై దాదాపు ప‌దేళ్లు అవుతున్నా, వారికి పిల్ల‌లు ఎప్పుడు పుడ‌తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అప్ప‌ట్లో ఓ సారి ప్ర‌గ్నెన్సీ విష‌యం గురించి ఉపాస‌న‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు.

ఇకపోతే విషయం ఏమంటే, ఇదే విషయం చిరుని కాస్త కలవరపాటుకు గురి చేస్తోందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వారు ఇద్దరూ ఆ విషయంలో ఎందుకు ఎడబాటు పాటిస్తున్నారో తెలియక తలపట్టుకుంటున్నాడట. ఈమధ్యన ఒకసారి ఉపాసన కాస్త బొద్దుగా కనబడటంతో సోషల్ మీడియాలో ఆమె తల్లికాబోతోంది అన్న వార్త గుప్పుమంది. ఇక అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న కల నిజం కానుందని తెలుస్తుండటంతో మెగా శిబిరాల్లో సంబరాలు మిన్నంటాయి.

ఇక ఆ విషయం అబద్ధం అని తేలడంతో అభిమానుల నోళ్లు మూగబోయాయి. ఓ వైపు ఆ వార్త నిజమని తేలితే నాకన్నా సంతోషించేవారు ఎవరు ఉండరని చిరు తన సన్నిహితులతో అన్నారట. కోడలుగా ఉపాసన ఎన్నో విషయాల్లో మెగా ఫ్యామిలీని మెప్పించినా ఆ విషయంలో మాత్రం ఆమె ఇంకా పోస్ట్ ఫోన్ వేయడంతో వారిమధ్య కాస్త కోల్డ్ వార్ నెలకొందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇకనైనా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి వారి కోరిక నెరవేర్చాలని కోరుకుందాం.

Share post:

Latest