మెగా భ‌జ‌న‌లో మునిగిపోయిన కుర్ర హీరోయిన్‌…. వ‌రుస పెట్టి బిస్కట్లు వేస్తోందిగా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోయిన్ల అందరిలో అందాల భామ కృతి శెట్టి రూటే సపరేట్. కృతి శెట్టి తన మొదటి సినిమా అయినా ఉప్పెన లో మెగా మేన‌ల్లుడు అయిన పంజా వైష్ణవ తేజ్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో కృతి శెట్టి కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దింతో వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఉప్పెన సినిమా త‌ర్వాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స్టార్ హిరోయిన్ ఇమేజ్ ద‌క్యించుకుంది.

Here We Introduce Aasi And Sangeeta From 'Uppena'

తాజాగా వచ్చిన ది వారియర్ -మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో మాత్రం కాస్త నిరాశపరిచాయి. కృతి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగాా ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఆమె నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చింది. కాగా నిన్న రాత్రి తన ట్విట్టర్ లో త‌న అభిమానుల‌తో ఇంట్రాక్ట్ అయింది. వారితో కొన్ని ఆస్తిక‌ర విష‌య‌లు చెప్పింది. త‌న అభిమానులు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్ర‌ల‌కు జ‌వాబు ఇస్తు వారిలో ఓ అభిమాని మీకు ఇష్ట‌మైన హిరో ఎవ‌రు అని అడ‌గ‌గా కృతి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేసింది.

Image

మెగా హీరో పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి తాను కూడా మీ అందరిలానే మెగా ఫ్యాన్ నే అంటూ అస‌క్తిక‌ర‌ రిప్లై ఇవ్వడంతో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఈమె అంత‌క ముందే రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ ని కూడా చెప్పింది. మ‌రి ఇప్పుడు కృతి మెగా భ‌జ‌న చేస్తు తాన సినిమాల‌ను ప్ర‌మోట్‌ చేసుకుంటుంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. కృతి బిస్క‌ట్ల వెన‌క మెగా హీరోల సినిమాల్లో ఛాన్సుల కోస‌మే అన్న‌ది వేరే చెప్ప‌క్కర్లేదు.

Share post:

Latest