ఆ హీరో తో పండగ చేసుకుంటూ..కొత్త డౌట్లు పుట్టిస్తున్న కీర్తి సురేష్..!?

వైవిధ్య భ‌రిత పాత్ర‌లను ఎంచుకుంటూ ప్రతి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో జీవం పోసి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న న‌టి కీర్తీసురేష్. ‘నేనుశైల‌జ’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటి తెలుగులో త‌న అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింది. ‘మ‌హాన‌టి’ సినిమ‌తో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మ‌హాన‌టి’ విజ‌యంతో ఈమెకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. కీర్తీ కూడా వ‌చ్చిన ప్రతీ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్క‌డే ఆమె పెద్ద పొర‌పాటు చేసింది. అవ‌కాశాలు వ‌స్తున్నాయి కదా అని క‌థ‌ల గురించి ఆలోచించకుండా సినిమాల‌ను చేసింది. అవి కాస్త ఫ్లాప్‌లుగా నిలిచాయి. చాలా కాలం త‌ర్వాత సాని కాదియం, స‌ర్కారు వారి పాట‌తో వ‌రుస‌గా రెండు హిట్ల‌ను తన ఖాతాలో వేసుకుంది.

Keerthy Suresh Marriage soon ? Reports say she is getting ready to marry a leading businessman - MixIndia

కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా సౌత్ భాషల అన్నిటి లోను నటిస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ గత మే నెలలో ప్రారంభించి శరవేగంగా షూటింగును జరుపుకుంటుంది. ఈ సినిమాకు సెల్వ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, రెడ్ జాయింట్ మూవీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. నిన్న మలయాళీ సంప్రదాయ ఓనం పండుగ సందర్భంగా కీర్తి సురేష్ ఈ మూవీ సెట్‌లో ఉదయ‌నిధి స్టాలిన్ తో కలిసి సందడి చేసింది.

Keerthy Suresh looks fabulous in a simple Onam look check her viral pictures in saree

ఓనం పండగ అంటే మల‌యాళీ వారికి అతి పెద్ద పండుగ. ఈ పండుగను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎక్కడ ఉన్న ఈ పండక్కి వారు తమ‌ సొంత ఇంటికి వెళ్లి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో కీర్తి సురేష్ తన సొంత ఇంటికి వెళ్ళటం కుదరలేదు. దీంతో కీర్తి సురేష్ అక్కడే పండుగ చేసుకుంది. ఆమె చక్కని సంప్రదాయ లంగా వోణీని ధరించి రంగు రంగు ముగ్గులు తానే స్వయంగా వేసి ఓనం పండుగను ఎంతో సంప్రదాయంగా ఆ షూటింగ్ సెట్‌లో తను జరుపుకుంది. ఉదయ‌నిధిస్టాలిన్‌ ఆమెతో పాటు ఈ చిత్ర యూనిట్‌కు విందును ఏర్పాటు చేశాడు. చిత్ర యూనిట్‌కు కీర్తి సురేష్ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. కీర్తి సురేష్ ఉదయనిధి ఫోటోలు బయటికి రావటంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

 

Share post:

Latest