శంకర్ మరో తలతిక్క పని..షాక్ లో అభిమానులు..?

కోలీవుడ్ క్రేజీ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోని అగ్ర దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటేనే అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. శంకర్ ప్రతి సినిమాను విభిన్నమైన కథ అంశాలతో తీస్తాడు. ఆయన తీసిన సినిమాలకు సినిమాకి సినిమాకి పొంతన ఉండదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఆయన మొదటి సినిమాలానే ఉంటుంది.

Director Shankar faces yet another controversy! Tamil Movie, Music Reviews  and News

శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు, వీటితోపాటు లోక నాయకుడు కమలహాసన్ తో భారతీయుడు2 సినిమా కూడా చేస్తున్నాడు. తాజాగా శంకర్‌ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ ఈ సినిమాలు తర్వాత ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో భారీ సినిమా తీస్తారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఎస్ వెంకటేష్ చారిత్రాత్మ‌క‌ నేపథ్యంలో రాసిన నవల ఆధారంగా శంకర్ సినిమా తియ‌నున్నాడట.

Suriya says director Shankar's been doing pan-India movies for 30 years -  Movies News

ఆ సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోతున్నాడని టాక్. ఈ వార్త బయటకు రావ‌టంతో శంకర్- సూర్య అభిమానులు కొంచెం ఆశ్చర్యానికి గురవుతున్నారు. శంక‌ర్ ఇంత తల తిక్క పని ఎందుకు చేస్తున్నారంటూ శంకర్ పై కొందరు నెటిజెన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ముందు మీరు కమిట్ అయిన సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాల‌ గురించి చూడండి సార్‌ అంటూ మరికొందరు నెటిజన్స్ ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో శంకర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి చూడాలి ఇన్ని బూతులు తిట్టించుకుంటున్న శంకర్ ఆ సినిమాని ఎలా తరికెక్కిస్తాడో చూడాలి.

Share post:

Latest