టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో లైగర్… రౌడీనా మజాకా?

విజయ్ దేవరకొండ అనేకంటే రౌడీ దేవరకొండ అంటేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అవును.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. దానికి ముందు ‘ఎవడే సుభ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది.

దాంతో అతగాడు మొదటి సారిగా పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ చేస్తున్నాడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన అంచనాలు భారీగానే వున్నాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సినిమాలు వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం విదితమే. అలాగే RRR సినిమా అయితే తెలుగులో ఏకంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌‌తో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. అలాగే అటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా ఆ లిస్టులోకి లైగర్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రౌడీ బాయ్ నటించిన లైగర్ కూడా అదే రేంజులో బిజినెస్ చేయనుందని రౌడీ అభిమానులు మంచి నమ్మకంతో వున్నారు. ఇప్పటికీ తెలుగులో వందకోట్లకు పైగా బిజినెస్ చేసిందని భోగట్టా… అలాగే మిగతా భాషల్లో వ్యాపారం చేస్తే RRR రేంజ్ లో దూసుకుపోవడం ఖాయం.