శభాష్ రష్మిక.. హీరోయిన్ అంటే నీలానే ఉండాలి(వీడియో) వైరల్..!

యస్ ఇప్పుడు ఇదే అంటున్నారు జనాభా. హీరోయిన్ అంటే రష్మిక మందన్న లాగే ఉండాలి అని.. ఆమెలాగే డౌన్ టు ఎర్త్ ఉంటేనే హీరోయిన్ గా ఎదగగలరని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. దీన్నంతటికీ కారణం ఆమె రీసెంట్ గా చేసిన మంచిపనే ఎక్స్పోజింగ్ విషయంలో అభిమానుల చేత ఎంత ట్రోల్ అయినా ..రీసెంట్ గా ఆమె ముంబై విమానాశ్రయంలో చేసిన మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారి.. రష్మికను దేవతలా చూసేలా చేసింది. ఇంతకీ రష్మిక మందన ఏం చేసిందో తెలుసా..?


రీసెంట్ గా ముంబై విమానాశ్రయంలో తళిక్కుమన్న నేషనల్ క్రష్ రష్మిక ఎయిర్ పోర్ట్ లో ఆమె బీహేవియర్ కి సంబంధించిన మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ తో ఫోటో దిగాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా కనపడితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సెల్ఫీ అంటారు . ఈ అలవాటు చాలా మందికి ఉంది . కానీ, కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఫోటోలు దిగడానికి ఇష్టపడరు. చీదరించుకున్నట్లు చూస్తారు. కొందరు సెక్యూరిటీతో చెప్పి గెంటేస్తారు. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్ రష్మిక మాత్రం అలా చేయలేదు.

ముంబై ఎయిర్ పోర్ట్ లో క్యాజువల్ లుక్స్ తో కనిపించిన రష్మిక తనకోసం వచ్చిన అభిమానుల్ని నిరాశపరచలేదు. ప్రేమగా దగ్గరకు వెళ్ళి సరదాగా మాట్లాడుతూ సెఫీ లు దిగ్గింది. అంతేకాదు ఓ బుడ్డోడు పై చేయి వేసి ప్రేమగా మాట్లాడడం ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మదన్నా అక్కడ ఉన్న వారందరితో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజులు ఇవ్వడం తో పాటు ఎంతో ప్రేమగా మాట్లాడడం.. చిన్నపిల్లలను దగ్గరికి తీసుకొని మరి సెల్ఫీ ఇవ్వడం ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో హీరోయిన్ అంటే నీలానే ఉండాలి రష్మిక అంటూ ఆమె అభిమానులు పొగిడేస్తున్నారు.

Share post:

Latest