బిగ్ బి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న చిరు..పోస్ట్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా .. ఇతర రాష్ట్రాలలో సైతం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇక నిన్నటి రోజున చిరంజీవి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇక చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోమంది హీరోయిన్లు సైతం ఆత్రుతగా ఉంటారు. ఇక దర్శక నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి.Chiranjeevi on working with Amitabh Bachchan: I was impressed and overwhelmed by his generosity | Celebrities News – India TV1970లో తన కెరీర్ ని మొదలుపెట్టిన చిరంజీవి 1980వ సంవత్సరంలో వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుని తిరుగులేని స్టార్ హీరోగా అనిపించుకున్నారు. ఇక తర్వాత 1990లో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకొని స్టార్ లలో చిరంజీవి కూడా ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించి ఒక వార్త పత్రికలో అలాంటి విషయం ప్రచురించబడింది ప్రస్తుతం ఆ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవి ఎంతటి పారితోషకం అందుకున్నాడు చూద్దాం.

ఇక 1992 సెప్టెంబర్ 13న విడుదలైన ఒక మ్యాగజైన్ పేపర్లో చిరంజీవి ఒక సినిమాకి దాదాపుగా రూ.1.25 కోత రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ప్రచురించబడింది. ఇక ఆ పోస్టర్ లో అమితాబచ్చన్ కంటే.. పెద్ద అంటూ అక్షరాలతో ట్యాగ్ లైన్ చేయడం జరిగింది. 1990లో చిరంజీవి వరుసగా మంచి విజయాలను అందుకొని ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. అలా చిరంజీవి రెమ్యూనరేషన్ పెరగడం కూడా జరిగింది. దీంతో చిరంజీవి అభిమానుల సైతం ఈ ఫోటోను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇక మరి కొంతమంది అభిమానులు ఈ ఫోటోను చూసి ప్రశంసిస్తూ ఉన్నారు.

https://twitter.com/FilmHistoryPic/status/1561570232254320642?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1561570232254320642%7Ctwgr%5E3fd91305f1741b6c863a5d4d76c28ed6e2d89925%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fmegastar-chiranjeevis-salary-was-bigger-than-bachchans-old-pepar-photo-goes-viral-au55-769308.html