తల పొగరెక్కి చిరంజీవిని టార్చర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

కొందరు హీరోయిన్స్ అవకాశాలు రాకపోతే కాళ్ల బేరానికి వస్తారు. అదే వరుస హిట్స్ అందుకొని.. ఒక స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగి.. లెక్కలేనన్ని ఆఫర్లు చేతికొస్తే తల మీదకెక్కి కూర్చుంటారు. వారిలో త్రిష కూడా ఒకరని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆమెకు చాలా గర్వం ఎక్కువ. ఈ ముద్దుగుమ్మ 2005 నాటికి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చెన్నై అమ్మడు తన స్టార్డమ్‌తో స్టార్ హీరోల సరసన నటించే అదృష్టాన్ని అందుకుంది.

అయితే 2006లో మెగాస్టార్ చిరంజీవి సరసన స్టాలిన్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ అందచందాలు, నటన అభినయం, క్రేజ్‌ చూసి ఏఆర్ మురుగదాస్ హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. చిరంజీవి కూడా ఓకే చేశాడు. కానీ వారు ఎంత పెద్ద తప్పు చేశారో ఆ తర్వాత తెలిసింది. స్టాలిన్ మూవీ షూటింగ్ ఈ సమయంలో త్రిష చిరంజీవిని చాలా టార్చర్ చేసిందట. డైరెక్టర్ పిలిచినా సమయానికి రాకుండా తన ఇష్టానుసారం ఎప్పుడో తీరిగ్గా వచ్చేదట. ఆమె వస్తే షూటింగ్ స్టార్ట్ చేద్దామని చిరంజీవి సెట్స్‌కి వచ్చి ఎదురుచూసే వాడట. ఇలా ఒక్కసారి కాదు సినిమా అయిపోయే అంతవరకు ఇదే యాటిట్యూడ్ త్రిష చూపించిందట.

మురుగదాస్ ఎన్నిసార్లు టైమ్‌కి రావాలని కోరినా ఆమె అసలు పట్టించుకునేది కాదట. తనకు నచ్చినప్పుడు వస్తా అనే ఆటిట్యూడ్ కనబరిచిందట. అయితే ఈ మూవీలో అనుష్క ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అనుష్కలో మాత్రం పంక్చువాలిటీ కరెక్ట్ గా ఉందట. అలానే చిరు, అనుష్క జోడి కూడా అదిరిపోయిందట. దాంతో త్రిష కన్నా అనుష్కనే చాలా మేలు, ఈమెని హీరోయిన్ గా తీసుకున్నా బాగుండు, అనవసరంగా త్రిషని ఎంపిక చేశాం అని మూవీ టీమ్‌ చాలాసార్లు తిట్టుకున్నారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. త్రిషకి ఉన్న తలపొగరు వల్లే ఆచార్య సినిమాలో ఆమెను చిరంజీవి వద్దంటే వద్దన్నారని కూడా టాక్. కాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నాలుగు తమిళ సినిమాల్లో, ఒక మలయాళం సినిమాలో చేస్తోంది.