షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!

రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌‌గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే సూపర్ హిట్ సినిమా కూడా తోడు అవడంతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

ఈ రౌడీ బాయ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ని షురూ చేసింది చిత్రబృందం. ఈ తరుణంలోనే పాపులర్ టాక్ ‘కాపీ విత్ కరణ్‌’కి అనన్యపాండేతో కలిసి విజయ్ అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండని శృంగారం చేసిన క్రేజీ ప్లేస్ ఏదంటూ కరణ్ అడిగితే.. విజయ్ నుంచి ఊహించని సమాధానం ఇచ్చాడు. దాంతోనే ఇపుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది!

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తాజాగా ఎపీసోడ్ ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విడుదల చేయగా ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా కరణ్ విజయ్ ని ఉద్దేశించి లేటెస్ట్ గా నువ్వు సెక్స్ లో పాల్గొన్నది ఎప్పుడూ అని కరణ్ అడిగితే, విజయ్ దాటవేయాలని ఎబార్ట్ అంటే, అనన్య మాత్రం ‘ఊహించి చెప్పనా, ఈ ఉదయం’ అనేసింది. ‘పబ్లిక్ ప్లేస్ లో శృంగారంలో పాల్గొన్నావా?’ అనే ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ… కారులో చేశాననీ, తప్పని పరిస్థితులో అలా చేయాల్సి వచ్చిందనీ అన్నాడు. అలాగే బోటులో కూడా చేశానంటూ చెప్పుకొచ్చాడు.