తమిళ హీరో ధ‌నుష్‌కు కౌంట‌ర్ ఇచ్చిన ఐశ్వ‌ర్య‌.. మనోడికి దిమ్మతిరిగుంటది!

తమిళ హీరో ధ‌నుష్‌కు ఐశ్వ‌ర్య‌ కౌంట‌ర్ ఇచ్చింది. ఆ ఐశ్వ‌ర్య‌ మరెవరో కాదండి. ధనుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య‌ రజనీకాంత్. ధనుష్‌ – ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సంవత్సరం తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని తమిళ తంబీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంది.

ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ సంచలన ట్వీట్‌ చేసింది. జిమ్‌లో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ.. దానికి కొన్ని వాక్యాలు యాడ్ చేసింది. “బయటి నుంచి ఎలాంటి ప్రతికూలత వచ్చినా దానిని సమర్థవంతగా ప్రతిఘటించగలను. అందుకు ప్రేరణ నాలోనే ఉంది. ఇక నెగిటివిటి లేకుండా జీవించగలను!” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసి ధనుష్ అభిమానులు న్యూనతాభావంతో ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. కొంతమంది ఐశ్వ‌ర్య‌ ఫాలోవర్స్‌ మాత్రం దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఐశ్వర్య రజినీకాంత్‌ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె గతంలో 3 అనే మూవీ తీసిన సంగతి విదితమే. ఈ సినిమా వసూళ్ల పరంగా ఆడకపోయినప్పటికీ అప్పట్లో క్రిటిక్స్ మెప్పుని పొందింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ అనే పాట అశేష జనాలను ఎంతగానో ఆకట్టుకుంది.