She is My Darling..నాకు తనంటే చాలా ఇష్టం..ఓపెన్ గా చెప్పేసిన రౌడీ ఫెలో..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఏం చేసిన సంచలనమే. షర్ట్ విప్పిన జనాలకు నచ్చుతుంది..ముద్దులు పెట్టిన నచ్చుతుంది.. చంపకేసి కొట్టిన జనాలకు నచ్చుతుంది. అదేంటో తెలియదు విజయ్ ఏం చేసిన జనాల ఆయనను తెగ ఆదరిస్తారు. అందుకే కాబోలు ఆయనకు హ్యూజ్ లేడి ఫాలోయింగ్ ఉంది. మొన్న ఆ మధ్య ఓ అమ్మాయి ఏకంగా తన వీపు పై విజయ్ బొమ్మని పచ్చబొట్టు పొడిపించుకుంది. ఓ ఆడపిల్ల అది పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా చేసిందంటే..ఏమనుకోవాలి..ఆ హీరో అంటే అభిమానమా..లేక పిచ్చా..?

ఈ అమ్మాయే కాదు హీరోయిన్స్ కూడా విజయ్ అంటే పడి చచ్చిపోతారు. అలాంటి వారిలో నేషనల్ రష్మిక కూడా ఒకరు. తెర పై వీళ్ళ జంట కెమిస్ట్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీత గోవిందం సినిమాలో ఈ జంటను చూసిన ఎవరైన సరే చూడ చక్కని జంట అని అంటారు. ఇక ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్..మాత్రం లవర్స్ కి నచ్చుతుంది. ఆ ముద్దులు ఆ హగ్గులు అబ్బో అది చెప్పలేం చూడాల్సిందే. ఇంత కెమిస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీ ఊరుకుంటుందా..వాళ్ల ఇద్దరి మధ్య కిచ్ కిచ్ సంబంధం ఉందని సృష్టించింది. వాళ్ళు కూడా అంతే ఒకరి కోసం ఒకరు షూటింగ్ లోకేషన్లకి వెళ్ళడం..బయట తిరగడం మీడియా కంట పడటం..చేసారు. దీంతో వీళ్లు లవ్ లో ఉన్నారు అని అంతా అనుకున్నారు.

కానీ, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో ఆయన రష్మిక గురించి మాట్లాడుతూ..”She is My Darling..చాలా మంచిది.. నాకు తనంటే చాలా చాలా ఇష్టం. నేను అన్ని విషయాలు తన తో షేర్ చేసుకుంటాను. తను కూడా నాకు అన్ని విషయాలు చెప్పుతుంది. మేమిద్దరం మా కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటాం..నా మనసు అర్ధం చేసుకుంటుంది రష్మిక..నేను చాలా లక్కి ..అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం..”అంటూ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ లాస్ట్ లో ఫ్రెండ్ అంటు బిగ్ బాంబ్ పేల్చాడు విజయ్. ఆయన మాటలు బట్టి చూస్తే..రష్మిక అంటే విజయ్ కి ఇష్టం అని క్లీయర్ గా అర్ధమవుతుంది. కానీ దాని ప్రేమ అని గుర్తించలేకపోతున్నాడు ఈ రౌడి ఫెలో అంటున్నారు విజయ్ రష్మిక ఫ్యాన్స్. ఏమో మనం ఏది చెప్పలేం..ఇలా ఫ్రెండ్ అంటూ చెప్పిన వాళ్ళే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరేసి పిలల్ని కన్నారు..ఆ లిస్త్ లోకి వీళ్లు జాయిన్ అవుతారు ఏమో చూద్దాం..?